• No categories
  • No categories

సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు**రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*పేద బడుగు, బలహీన, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు,రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, కంబాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ, బయ్యారం మండల కేంద్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కోసం భూమి పూజ చేసి, గొల్లగూడెం బ్రిడ్జి , బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన, కొత్తపేట గ్రామంలో 3. కోట్ల20 ఐదు లక్షలతో హాస్టల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తు ఉందని అన్నారు, గతం 10 సంవత్సరాలలో సొంత ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందని అన్నారు, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500, 1వెయ్య కలిపి 4500 ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అనంతరం విడతల వారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు,రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు చేయడం రైతు రుణమాఫీ రైతు బీమా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు, మహిళా సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెట్రోల్ పంపులు నిర్వహణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయడం జరిగిందని,ఆరు గ్యారెంటీ ల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు,బయ్యారం మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు బరిగెల ఉపేంద్ర భర్త ఉపేందర్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసి వారికి నూతన వస్త్ర లను అందజేశారు, వేగంగా ప్రభుత్వ సూచించిన ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టి ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయడం జరుగుతుందని వారికి సూచించారు,ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని అందులో భాగంగానే కొత్తపేట లో . మూడు కోట్ల, 25 లక్షల వ్యయంతో వసతి గృహం నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్,ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, లు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తమ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధికి సహకరించినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె వీరబ్రహ్మచారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ హరిప్రసాద్, ప్రాథమిక సహకార సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజయ్య, అన్ని విభాగాల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.——————————–

Continue reading

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామ చందర్ నాయక్ గారి పేరును ప్రకటించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.

Continue reading

కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై మోదీ వివరణనివ్వాలి పహల్గాం’పై పార్లమెంటు సమావేశం నిర్వహించాలి ప్రజాసమస్యల సాధనకు పోరాటం జాన్వెస్లీ పిలుపు హనుమకొండ :భారత్, పాక్లకు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ వివరణనివ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరగడంపై దేశప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించకపోవడం సందేహాలకు తావిస్తుందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి విషయంలో రాజకీయాలకతీతంగా అన్నిపార్టీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ విషయంలో మద్దతునిచ్చాయని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై కేంద్రం ప్రచారం చేస్తుందని, ఇదే క్రమంలో ఈ సంఘటనపై ప్రధాని పార్లమెంటు సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయకపోవడం సందేహాలకు తావిస్తుందన్నారు. ఆకలి సూచికలో భారత్ ది 111వ స్థానం*నీతి ఆయోగ్ సమావేశంలో భారత్ 4వ అభివృద్ధి చెందిన దేశంగా ప్రధాని మోదీ చెప్పడాన్ని జాన్వెస్లీ తప్పుపట్టారు. 1శాతం ఉన్న కార్పొరేట్లు 40శాతం సంపదను కలిగి వున్నారన్నారు. 50 శాతం ఉన్న పేదలచేతిలో కేవలం 3 శాతం సంపద మాత్రమే వుందన్నారు. దేశంలో 42 శాతం మంది ప్రజలు ఉండడానికి కనీస సౌకర్యాలు లేకుండా వున్నారన్నారు. 30శాతం మంది ప్రజలకు పౌష్టికాహారం లోపముందని వివరించారు. నెలకు రూ.26 వేల కనీస వేతనమివ్వాలని కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దేశంలో ప్రజల మధ్య సంపద సమానంగా లేదన్నారు. సమాన అభివృద్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపివేయాలి*ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా ఆపివేయకపోవడం దారుణమని జాన్వెస్లీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగారన్ను వెంటనే ఆపివేయాలన్నారు. కాల్పుల విరమణకు సిద్ధమని, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. పైపెచ్చు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ 2026 మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి కేశవరావు, భూమిక తదితరులను హతమార్చి శవాలను సైతం బంధువులకు ఇవ్వకుండా కేంద్ర బలగాలు శవాల ముందు నృత్యం చేయడం, వారిని ప్రధాని మోదీ, అమిత్ అభినందించడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వాధినేతలుగా ఉండి మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించడం ఏమిటి ? అని ప్రశ్నించారు. 500 మందిని చంపేశారని, అందులో అత్యధికంగా ఆదివాసీ మహిళలే వున్నారన్నారు. ఆరుహామీలను నెరవేర్చాల్సిందే..లేదంటే గుణపాఠం తప్పదు*ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామిలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాల్సిందేనని, లేదంటే గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి డబ్బులు లేవని, ఏం చేయాలని మాట్లాడడం సరైంది కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ హామిలిచ్చి నెరవేర్చకుంటేనే ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ప్రజాసమస్యల సాధనకు పోరాటం ప్రజా సమస్యల సాధనకు సీపీఐ (ఎం) పోరాటం చేస్తుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో సీపీఐ (ఎం) నికరంగా పోరాడుతుందన్నారు.*గుడిసెల స్థానంలోనే ఇందిరమ్మ ఇండ్లు*పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి వారికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇండ్లు లేని వాళ్లున్నారన్నారు. నివేశనస్థలాల కోసం గుడిసెలు వేసుకున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని, హనుమకొండ నగరంలో ఇద్దరు రాజకీయ నేతల భవంతులను ఏం చేయకుండా, పేదల గుడిసెలను మాత్రం తొలగిస్తున్నారన్నారు. నగరంలో సుందరీకరణ పేరిట వీధి వ్యాపారుల షాపులను తొలగించడం సరికాదన్నారు. వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, వీరన్న, రాగుల రమేష్, గొడుగు వెంకట్, భానునాయక్, కాడబోయిన లింగయ్య, డి.తిరుపతి, జి. రాములు తదితరులు పాల్గొన్నారు.

Continue reading

తెలుగు వారి ఖ్యాతి ని ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి…విశ్వ విఖ్యాత నట సార్వాభౌమ…నటరత్న, పద్మశ్రీ, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 102 వ జయంతి సందర్బంగా.. ఈరోజు మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ పట్టణం లోఆ మహనీయుడికి ఘనంగా కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి వేడుకలు జరిపినారు.. ఈ కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు… సంపతీ బీష్మ, భూక్య సునీత, కట్ల వెంకన్న, రంగా రెడ్డి, హరికిషన్, పిట్టల రాము, దొంతు నరేష్, రామ్మూర్తి, తల్లాడ శ్రీనివాస్, భూక్య బాలు, గుగులోతు వీరన్న, జలందర్, తదితరులు పాల్గున్నారు…

Continue reading