తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, లతో కలిసి హైద్రాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ,యువకుల ఆర్ధిక అభివృద్ధి,ఉపాధి కల్పన సంక్షేమ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రాజీవ్ యువ వికాసం అని ఇప్పటికే ప్రభుత్వం సూచించిన ప్రకారం క్షేత్రస్థాయిలో సర్వే చేసి వెరిఫికేషన్ నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, మొదటి విడుతలో 50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు, సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, అట్టి ప్రొసీడింగ్స్ కాపీలు జూన్ 2 నుండి 9 వరకు అందచేయుటకు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు,
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఐదు విడతల్లో సుమారు 6250, కోట్ల నిధులతో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు, రాష్ట్రంలో నిరుద్యోగం రూపుమాపడానికి ప్రభుత్వ చిత్తశుద్ధితో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు,
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఎం.నరసింహస్వామి, శ్రీనివాసరావు, దేశీ రామ్, శ్రీనివాస్, జిల్లా వెల్ఫేర్ అధికారిని ధనమ్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, పాల్గొన్నారు.