ఖమ్మం త్రీ టౌన్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఖమ్మం : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు , విశ్వవిఖ్యాత , నటసార్వభౌమ , నటరత్న , పద్మశ్రీ , డాక్టర్ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా త్రీ టౌన్ ఏరియా కాల్వఓడ్డ లో ఉన్న ఎన్ టి రామారావు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు . తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు , సమాజమే దేవాలయం , ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని శ్వాసగా చేసుకొని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో బాతరాజు కనకయ్య , కందిబండ నరసరావు , కొడగంటి ఆంజనేయులు , ఓర్స్ కృష్ణ , జయరాం , కుసుమ రాము మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *