దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాము
(6) గ్యారంటీలు అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు,
రైతు సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుంది
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పని చేస్తుందన్నారు, ఆయన
మరిపెడ మండల కేంద్రంలో జూన్ రెండవ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామ్ చందర్ నాయక్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ, పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల సన్మాన కార్యక్రమం, నాణ్యమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యం కట్టుబడి ఉందని ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు,
పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ప్రభుత్వం 5 లక్షల మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి పక్కా గృహాలను నిర్మించడం జరుగుతుంది అని అన్నారు,
గత ప్రభుత్వంలో అనేక భూ సమస్యలు ఉండేవి అని ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అనేక ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం మన ప్రభుత్వం నూతన రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టం ప్రవేశ పెట్టడం జరిగింది అని దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయమైన వేగమైన భూ సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలను స్వీకరించడం జరిగింది అని రేపటి నుండి జూన్ 20 వరకు పూర్తిస్థాయిలో గ్రామ రెవెన్యూ సభలు నిర్వహించి ప్రజల యొక్క భూ సమస్యల వివరాలను సేకరించి పరిష్కరించడం కోసం కృషి చేస్తుందన్నారు,
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుంది అన్నారు,
యువతకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువత సన్మార్గంలో నడవడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణను ప్రారంభించడం జరిగిందని,
ఉద్యోగార్దులను 20వేల సంస్థలను 10 లక్షల వృత్తి నైపుణ్య కోర్సులను నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు,
ఇందిరా సౌర గిరిజన వికాసం, సన్న బియ్యం, రైతు బీమా, రైతు పంట రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, చెంచుల కు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు మంజూరు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, తదితర పథకాలను ప్రవేశపెట్టి దశలవారీగా అమలు చేయడం జరుగుతుంది అన్నారు,
అనంతరం పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను సన్మానించారు,
ఇందిరమ్మ మోడల్ ఇల్లును సందర్శించారు,
మరిపెడ మున్సిపల్, రూరల్ పరిధిలోని అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు,
రాష్ట్రవ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లా పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానంలో వచ్చినందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు,
స్వచ్ఛత పారిశుద్ధ్యం పై సభకు వచ్చిన వారితో కలిసి ప్రతిజ్ఞ చేశారు
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామ్ చందర్ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, సభను ఉద్దేశించి ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అమలు తదితర అంశాలపై మాట్లాడారు,
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.వీరబ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, సంబంధిత గృహ నిర్మాణం, వ్యవసాయ, రెవెన్యూ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.