బుధవారం బయ్యారం మండలం గౌరారం రెవెన్యూ గ్రామంలో జరుగుతున్న సదస్సును అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, పరిశీలించారు,
ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం-అని, భూ సమస్యలు పరిష్కారానికి మంచి పథకం ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన విస్తృత సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు,
ఈ సదస్సులో సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు వినియోగించుకోవాలి సూచించారు,
ధరకాస్తు ఇవ్వడం కోసం వచ్చే వారికి కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని అన్నారు,
రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు,
ఈ కార్యక్రమంలో స్థానిక తాహిసిల్దార్ నాగరాజు, ఉన్నారు.