హెచ్ సి ఎ డబ్ల్యూ డి సి ఏ సహకారంతో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగింపు మరియు క్యాంపు టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ఘనంగా నిర్వహించడం జరిగింది
అనంతం జరిగిన ముగింపు సభ మరియు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి అధ్యక్షత వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమ్మడి వరంగల్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ డబ్ల్యు డి సి ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబాద్ క్రికెట్ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎంతమంది క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారని పిలుపునిచ్చారు ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి అన్ని వసతులు ఉన్నాయన్నారు ఈ ప్రాంత క్రీడాకారులను తీర్చిదిద్దుటలో బి అజయ్ సారధి రెడ్డి గారి సేవలు మరువలేని అన్నారు అజయ్ సారధి రెడ్డి గారు క్రికెట్ అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు
హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ హెచ్‌సీఏ తో మాట్లాడి ఇక్కడ మరిన్ని అవకాశాలు అందించుటలో అపెక్స్ కౌన్సిల్లో కూడా మాట్లాడి సరియైన సౌకర్యం మరియు సహకారం అందిస్తామని తెలిపారు ఇక్కడున్న అధికారులు ప్రజాప్రతినిధులు క్రికెట్ కు మైదానం అందించాలన్నారు, పట్టుదలతో కృషి చేస్తే క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి మహబూబాబాద్ ప్రాంతం నుంచి ఎదుగుతారని పిలుపునిచ్చారు ఈ ప్రాంతంలో నెలరోజుల పాటు క్యాంపు నిర్వహించి క్రీడాకారులను మెలకువలు నేర్పించి తీర్చిదిద్ది ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ లో మంచి ప్రతిభ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ గారి ద్వారా మహబూబాబాద్ క్రికెట్‌కు ఎంతో సహకారం లభిస్తుందన్నారు వారు ఇక్కడ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన టోర్నమెంట్స్ లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతి ప్రధానోత్సవం షీల్డ్‌లు మరియు మెడల్స్ కోచింగ్ క్యాంప్‌లో పాల్గొన్న క్రీడాకారుల అందరికీ సర్టిఫికెట్స్ అందించారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్, కోచ్ మెతుకు కుమార్, సహాయ కోచ్ సంతోష్, మెంబర్ రావుల నవీన్ రెడ్డి, నీలం వెంకటేశ్వర్లు, మురళి, బి చరిత్ రెడ్డి, బి ధర్మచరణ్ రెడ్డి, పెరుగు కుమార్, గాదం శ్యాం, ప్రసాద్ యాదవ్, వెలుగు శ్రావణ్, ఆబోతు అశోక్, కొండమీది రవి, వికాస్, జి రమేష్, క్రీడాకారులు మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు