డ్రగ్స్,సైబర్ నేరాల పై అవగాహన

మహబూబాబాద్

శ్రీ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు షీ టీం మహిళా SI సునంద గారు మరియు సైబర్ క్రైమ్ ఎస్సై కరుణాకర్ గారు సంయుక్తంగా ఏకశిల ఏంజెల్స్ స్కూల్ మహబూబాబాద్ నందు నిర్వహించుచున్నటువంటి గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం భాగంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది*

ఈ అవగాహన కార్యక్రమం నందు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *