ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
మహబూబాబాద్ హస్తినాపురం-ఎస్ ఆర్ నగర్ కాలనీలు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ పర్యటించిన సందర్భంగా కాలనీలో వరద సమస్యపై, ముంపు పై ఎమ్మెల్యేకు ఫోటో, వీడియో ద్వారా చూపించి వివరిస్తున్న ఎస్ ఆర్ నగర్ కాలనీ అధ్యక్షులు కల్లూరి ప్రభాకర్. కొత్త బజార్ నుంచి పాత బజారు వైపుకు వస్తున్న కాలువ నీరు, వరద నీరును కాలువ నిర్మాణం ద్వారా మళ్లించి బయటకు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మున్సిపల్ డి ఈ ఉపేందర్ కు ఎమ్మెల్యే ఆదేశించారు. కాలనీలో పలురోడ్లు, డ్రైనేజీర నిర్మాణం కోసం ఎమ్మెల్యే మురళి నాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి తీగల దుర్గేష్ ట్రెజరర్ పసునూరి విద్యాసాగర్, కమిటీ సభ్యులు రవీందర్, వాంకుడోత్ రమేష్, సాగర్, మురళి, శ్రీను, శోభ, 11 వార్డ్ కాంగ్రెస్ ఇన్చార్జి నజీర్, కాంగ్రెస్ నాయకులు, ఖలీల్, ఎడ్ల రమేష్, గిరిధర్ గుప్తా, మొగిలి ప్రసాద్, వంగ వెంకట్ రమణ, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.