మహబూబాబాద్
ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.
కురవి మండలం బలపాల గ్రామంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మెగా మేళా లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముఖ్య అతిది గా పాల్గొని ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ బోర్ల క్రింద ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేయాలని మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు గడప గడపకు ఆయిల్ పామ్ సాగు ఒక ఎకరానికి పామాయిల్ గెలల దిగుబడి పది టన్నులు ఒక ఎకరానికి లక్షకు పైగా ఆదాయం నెలనెలా స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ తోనే సాధ్యం అని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 8000 ఎకరాల పైగా పామాయిల్ సాగు అవుతుందని, 1350 ఎకరాలలో పామాయిల్ గెలలు దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారన్నారు. ఈ సంవత్సరానికి గాను 4500 ఎకరాల లక్ష్యం తో ఇప్పటి వరకు 663 ఎకరాలలో మొక్కలు నాటడానికి రైతులు అనుమతి పొందినారన్నారు.
ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలని, కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు బజ్జూరి పిచ్చి రెడ్డి, బజ్జూరి ఉమా, యం. రమేష్, హనుమంత రావు, చంద్రారెడ్డి, , సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ. శ్రీనివాస్, వ్యవసాయ అధికారి జి. నరసింహ రావు, ఉద్యాన అధికారి ఆర్. శాంతి ప్రియ, వ్యవసాయ విస్తరణ అధికారి లయ, టి. జి. ఆయిల్ ఫెడ్ క్షేత్ర సిబ్బంది నాగరాజు, జి. చంద్ర ప్రకాష్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్. శ్రీనివాస రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హరి మరియు బిందు సేద్య ప్రతినిది ఆగస్టిన్, కె. శంకర్ తదితరులు పాల్గొన్నారు.