మాజీ జెడ్పిటిసి సుచిత్ర బాలునాయక్…ఘనంగా డాక్టర్స్ ‘డే’…మైత్రి మల్టీస్పెషాల్టి ఆసుపత్రిలో వైద్యులకు సన్మానం
మైత్రి మల్టీస్పెషాల్టి ఆసుపత్రిలో వైద్యులకు సన్మానం
మహబూబాబాద్:
ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దడంలో వైద్యుల పాత్ర కీలకమని గూడూరు మాజీ జడ్పిటిసి సుచిత్ర బాలు నాయక్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని
మహబూబాబాద్ లోని మైత్రి మల్టీస్పెషాల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుచిత్రబాలునాయక్ మాట్లాడుతూ కనిపించని దేవుడు మనిషికి ఊపిరి పోస్తే కనిపించే డాక్టరు అదే మనిషికి పునర్జన్మని ఇస్తాడని, నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం వైద్యుడేనని ఆమె స్పష్టం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ బాలునాయక్, డాక్టర్ కుమార్, డాక్టర్ హేమంత్, డాక్టర్ నాగార్జున్ రెడ్డి, డాక్టర్ సైదా అలీని ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసి సుచిత్ర బాలునాయక్ ఘనంగా సన్మానించారు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే మహాశక్తిగా భావించి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ ధన్యవాదాలు జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.