బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లను పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలనీ, జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు,బుధవారం కలెక్టరేట్ ఎన్ఐసి హాలులో సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు,
గత సంవత్సరం ఆపరేషన్ స్మైల్- 25 కార్యక్రమంలో భాగంగా వివిధ డిపార్ట్మెంటులో కలిసి పనిచేసే 25, మంది పిల్లలను రిస్కు చేయడం జరిగిందని, అందులో భాగంగా 14 మంది యజమానులపై వివిధ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు, రాజస్థాన్1, బీహార్1, ఉత్తరప్రదేశ్ 2, కర్ణాటక 1, ఆంధ్రప్రదేశ్ 1, తెలంగాణ 18 ప్రాంతాల కు చెందిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు,

ఆపరేషన్ ముస్కాన్-24, కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరంలో 22, మంది పిల్లలను రెస్కు చేయడం జరిగిందని, అందులో చత్తీస్గడ్ 1, ఒడిష1, తెలంగాణ 19, లలో కలిపి వారి నివాస ప్రాంతాలకు పంపించి తల్లిదండ్రులకు అప్పగించనైనదన్నారు. డ్రాప్ అవుట్ అయిన పిల్లలకు ఒకేషనల్, తదితర కోర్సులు నిర్వహించాలని, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు,
బాల కార్మిక నిర్మూలనకు తెలిపిన చట్టాలను శత్రుస్థాయిలో సంబంధిత విభాగాలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నాగవాణి, సంబంధిత విభాగాల అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు, అనంతరం జూలై 1- 31 వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్ – XI , అనే పోస్టర్ ను ఆవిష్కరించారు చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న ఈ క్రింద చూపిన నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ 1098 , 112. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారిని శిరీష, డి.ఎస్.పి తిరుపతిరావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, సిడబ్ల్యుసి చైర్పర్సన్ నాగవాణి, సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *