ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారి విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో శ్రీ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, రోశయ్య గారి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు హాజరయ్యారు.