పసుపులేటి వెంకట్ -మహబూబాబాద్
ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,
శనివారం కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ డివిజనల్ అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ, మంగళవారం రోజు మహబూబాబాద్ మండలం సొమ్లతండా, కేసముద్రం మండలాలలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం పక్కాగా కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని, అతిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారికేడ్లు నిర్మించాలని, సభా ప్రాంగణంలో త్రాగునీరు సౌకర్యం, వైద్య శిబిరాలు, ఏర్పాటుచేసి, సానీటేషన్ చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పార్కింగ్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని,
సంబంధిత విభాగాలు జిల్లా యంత్రాంగం సమన్వయంతో కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, తొర్రూరు, మహబూబాబాద్, రెవిన్యూ డివిజనల్ అధికారులు గణేష్, కృష్ణవేణి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఈఈ లు విద్యాసాగర్, భీమ్లా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, డిపిఓ హరిప్రసాద్, అన్ని విభాగాల జిల్లా అధికారులు కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపరింటెండెంట్ మదన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.