రాష్ట్రం ఏమైనా పరవాలేదు కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకోండని ఆంధ్రప్రదేశ్లో నాడు సీఎం గా ఉన్న కేసీఆర్ ప్రకటించారా ?లేదా?
ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ.
వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం
గత ప్రభుత్వం కన్నా రెండు వేల మెగావాట్లు అత్యధికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రెప్పపాటు అంతరాయం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది
రైతుల సంక్షేమం కోసం ఒక్క సంవత్సరంలోనే 70 వేల కోట్లు ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది
లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరం కట్టి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. వాస్తవాలు బయటికి వస్తున్నాయని టిఆర్ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు
10 సంవత్సరాల్లో లక్ష నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టి
పట్టుమని పది ఎకరాలకు నీళ్లు ఇవ్వని వారు కాలేశ్వరం వాస్తవాలు బయటికి వస్తున్నాయని వాటిని కప్పిపుచ్చుకునేందుకు టిఆర్ఎస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు వారు తప్పుడు మాటలు బంద్ చేయాలి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కదని సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం ఇంటింటికి చేర వేసుకుంటూ ముందుకు పోతుందని, టిఆర్ఎస్ నేతలు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని సీఎం రేవంత్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మహబూబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సోమల తండాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఆయనకు బేసిన్ ల గురించి తెలియదని టిఆర్ఎస్ నేతలు ఇష్టా రీతిగా మాట్లాడుతున్నారు ఆయనకు బేసిన్ల గురించి తెలియకపోతే కృష్ణ, గోదావరి బేసిన్ నీళ్లను ఈ రాష్ట్ర అవసరాల కోసమే వాడాలని ప్రజాభవన్ లో మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అందరికీ వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో నీళ్ల విషయంలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపించారని డిప్యూటీ సీఎం తెలిపారు. బేసిన్లు లేవు, దేశజాలు లేవు రాష్ట్రంలో ఏమైనా పర్వాలేదు కృష్ణా గోదావరి నీళ్లు వాడుకోండని పెద్దమనిషి కేసిఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రకటన చేసిన విషయాన్ని వీడియోలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో చూపించారని తెలిపారు. కృష్ణా, గోదావరికి బేసిన్ ప్రాజెక్టుల్లో నీళ్ల గురించి లెక్కలతో సహా చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చర్చించడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు, అదే విషయాన్ని మరోసారి చెబుతున్నాను కృష్ణ, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది పెద్ద మనిషి కేసీఆర్ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసురుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
లక్ష కోట్ల పైబడి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే వాస్తవాలను టిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదు, నిజంగా వారికి రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత నిబద్ధత ఉంటే శాసనసభకు రండి లెక్కలు తీసుకొని రండి చర్చిద్దాం, ఎవరిది నిజమో, ఎవరిది అబద్దమో అని సీఎం రేవంత్ రెడ్డి పెద్దమనిషి కేసిఆర్ కు సవాల్ విసిరితే.. కెసిఆర్ సవాల్ స్వీకరించకుండా ఇంకొక ఆయన బయలుదేరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఏమిటి? వీరికి అర్థమవుతుందా? ప్రెస్ క్లబ్ కు వచ్చి సవాల్ అంటే ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాలని ఆలోచన ఉంటే శాసనసభకు రావాలి రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది, టిఆర్ఎస్ నాయకత్వం మొత్తానికి తాను సవాల్ విసురుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని నోరు ఉంది కదా అని టిఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మీ పాలనా కాలంలో ఉన్న కరెంటు డిమాండ్ ఎంత, ప్రస్తుత కరెంటు డిమాండ్ ఎంత చర్చకు సిద్ధమా అని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.
గత ప్రభుత్వ కాలంలో 17,162 మెగావాట్ల పిక్ డిమాండ్ ఉండగా ఈ సంవత్సరం మార్చిలో అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చిందని వివరించారు. 2000 మెగావాట్లు అదనపు డిమాండ్ వచ్చినప్పటికీ రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం, రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తు సేవలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.
రైతాంగ సోదరుల కలలు నిజం చేయడానికి ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లోనే ప్రజా ప్రభుత్వం 21 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసింది, రుతుపవనాలు మొదలుకాగానే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జవచేసి ప్రజా ప్రభుత్వం నిబద్దతను చాటుకుందని డిప్యూటీ సీఎం తెలిపారు. 10 సంవత్సరాల కాలంలో నాలుగు దఫాలుగా 25,000 చొప్పున టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తే అవి వడ్డీకే సరిపోలేదని డిప్యూటీ సీఎం అన్నారు.
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందిస్తూ వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12,500 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం కింద ఈ రాష్ట్రంలో 50 యొక్క లక్షల మంది పేదలు ప్రయోజనం పొందుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.
గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేందుకు అటవీ హక్కుల చట్టం కింద పంపిణీ చేసిన భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నల్లమల డిక్లరేషన్ పేరుతో ప్రారంభించారని డిప్యూటీ సీఎం తెలిపారు.
పోడు రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు స్ప్రింక్లర్లు, డ్రిప్పు, అవకాడో, వెదురు వంటి మొక్కలు మొత్తం ఉచితంగా అందించేందుకు 12,600 కోట్ల రూపాయలు కేటాయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
మహిళలను గౌరవించుకోవడం మన సంస్కారం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించి మొదటి సంవత్సరంలో 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశాం అన్నారు.
ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున పంపిణీ చేయబోతున్నాం మహిళలందరినీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు.
పేద విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన విద్యను అప్పగించడానికి ఒక్కో పాఠశాలకు 200 కోట్లు కేటాయించి 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
భూమిలేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు కూలీల ఖాతాలో జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయలు చొప్పున బోనస్ చెల్లిస్తున్నాం, రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సే ట్లకు రెప్పపాటు అంతరాయం లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం, రైతులందరికీ ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు చేయడం పొరపాటా? అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు