మహబూబాబాద్ జిల్లాలో రూ 400 కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హాజరైన పలువురు మంత్రులు
సోమ్లా తండా, కేసముద్రం లో బహిరంగ సభ
మహాతెలంగాణ న్యూస్, మహబూబాబాద్ బ్యూరో:
రాష్ట్రంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని గత ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూనే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు, మంగళవారం మహబూబాబాద్ మండలం పర్వతగిరి సోమ్లా తండ గ్రామపంచాయతీలో 100 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గిరిజన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దేవాదాయ అటవీ శాఖ మంత్రి సురేఖ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే మురళి నాయక్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మహబూబాబాద్ నియోజకవర్గ సంక్షేమానికి 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని అందులో భాగంగా ఐదు కోట్ల రూపాయలతో 33 కేవి సబ్ స్టేషన్,బేతోల్ నుంచి సోమ్లా తండా వరకు 20 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం, జమాండ్లపల్లి నేషనల్ హైవే నుంచి 20 కోట రూపాయలతో బి టి రోడ్డు 5 కోట్ల రూపాయలతో సెంట్రల్ డ్రగ్ స్టోర్. గిరిజన అభివృద్ధి నిధుల నుంచి నేషనల్ హైవే నుంచి రాజలిపేట వరకు రోడ్డు ఏర్పాట్లు
సుమారు 50 కోట్ల రూపాయలతో కేసముద్రం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని తెలిపారు మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కొన్ని వినతులు అందించారు అందులో భాగంగా మానుకోటకు పట్టణం పైనుంచి వెళ్తున హై లెవెల్ విద్యుత్ లైన్లను తొలగించాలని, దానికి కోసం 7కోట్ల నిధులు అందించాలని మహబూబాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పేదవాని సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 17 నెలల ప్రజా పాలనలో ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ను అందిస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామని 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఇవే కాకుండా రైతు సంక్షేమానికి పది 10 సంవత్సరాల పాలనలో గత బి ఆర్ ఎస్ పాలనా లో 15 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే మా ఇందిరమ్మా పాలనలో 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని అన్నారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ వేసామని గుర్తు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వ
ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మొదటి విడత గా 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చామని, మహబూబాబాద్ లో 4 వేల ఇందిరమ్మా ఇండ్లు మంజూరు చేశామన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని దివాలా తీసింది కాక కేటీఆర్ మమ్మల్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
భూ సమస్యలు పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం అమలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
మంగళవారం మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండ,గ్రామపంచాయతీ కేసముద్రం మున్సిపాలిటి పరిధిలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య,వర్ధన్ననపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,
మహబూబాబాద్ పరిధిలో (07) పనులకు గాను అంచనా వ్యాయం 71.43 కోట్ల తో రహదారులు, పురపాలక పట్టణ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్, నూతన సబ్ స్టేషన్ నిర్మాణం, శంకుస్థాపనలు,
కేసముద్రం పరిధిలో (36) పనులకు గాను అంచనా వ్యాయం 223,35 కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, రహదారులు, భవనాల శాఖ, పట్టణంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు, తెలంగాణ ట్రాన్స్మిషన్ నూతన సబ్స్టేషన్ నిర్మాణం, సీసీ రోడ్లు కల్వర్టులు అంతర్గత అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, నూతన గిడ్డంగుల నిర్మాణం, దేవాదాయ శాఖ ఆలయాల అభివృద్ధి పనులు, తదితర శంకుస్థాపనలు చేశారు,
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక 11263, గ్రూపులకు 2129. లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారు,
మహబూబాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ యావత్తు ప్రపంచం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రైతు భరోసా, రుణమాఫీ, వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం అమలు నిధుల పెంపు, ప్రభుత్వ పాఠశాలలో కాస్మోటోకి చార్జీల పెంపు, నూతన డైట్ మెనూ అమలు, త్రాగునీరు, సాగునీరు, తదితర అనేక పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు,
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ధరణి ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత ప్రభుత్వం నూతన భూభారతి రెవెన్యూ చట్టం అమలు చేసి ప్రతి ఒక్కరి భూ సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తుందని అన్నారు, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు,
జిల్లాలోని నారాయణపురం, సీతానగరం, పంతులు తండా లలో ఉన్న భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు,
రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన విస్తృతంగా సాగుతుందని 9 రోజుల్లోనే 9000 కోట్ల రైతు భరోసా అందించి రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేశామన్నారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కేవలం 15 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే మా ప్రభుత్వం 17 నెలల్లో 21 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసి చూపించమన్నారు. ఇక మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో అహర్నిశలు పనిచేస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ ముఖ్యమంత్రి సలహాదారులు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మా పాలన ఏర్పడటానికి ముఖ్య భూమిక పోషించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నంటి వుండిన నేత వేం నరేందర్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. రాష్ట్రంలో
ఏ నియోజకవర్గానికి ఇవ్వని విదంగా 200 కోట్ల రూపాయల నిధులతో రోడ్లన్నీ మంజూరు జరిగాయాన్ని
నేడు వ్యవసాయ ఉత్పత్తులకు అవసరం ఉన్న గిడ్డంగులను సుమారు 10 కోట్ల రూపాయలతో నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో 100 కోట్ల రూపాయలతో కేసముద్రం మండల కేంద్రంలో 133 కెవి సబ్ స్టేషన్ 3 33 కెవి సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసుకు న్నామన్నారు.
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి ప్రజల ప్రగతి : మంత్రి సీతక్క
పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ,గ్రామీనాభివ్రుద్ది శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూకాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి ప్రజల ప్రగతి అని సంక్షేమం అభివృద్ధి పేదలను అన్ని రంగాల అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. నాడు ఇందిరమ్మ పేదల కడుపు తట్టి అందరికీ సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశంతో పనులు చేసిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మార్గంలో నడుస్తూ ప్రతి పేదవాడు కడుపునిండా సన్న బియ్యంతో తింటున్నానంటే దానికి కారణం మన ముఖ్యమంత్రని అన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి అవకాశం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాడల్లో కరెంటు బిల్లులు కట్టకుంటే కరెంటు కట్ చేసే వారని వారంతా చీకటిలో మగ్గిపోయారని మన ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తున్నాడని గుర్తు చేశారు వరి వేస్తే ఉరి అన్న గత ప్రభుత్వం నేడు ప్రజా పనుల ముఖ్యమంత్రి వరి రైతులకు 500 రూపాయలు కొనుగోలు చేశారన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత లభించాలంటే మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండాలని ఇప్పటికే 25 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని ఇంకా ఈ నెలలో మిగిలిన నిధులను మంచిది చేయడమే కాకుండా వడ్డీ లేని అందించడానికి లింకేజీలను అందిస్తామని అన్నారు. కేసముద్రం మండలంలో ఇందిరా శక్తి భవనం మూడు కోట్ల రూపాయలతో నిర్మించుకుంటామని అన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల గుండె చప్పుడు : మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర అటవీ, దేవదాయ,శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల గుండె చప్పుడు అని ప్రతి పేద వాని కడుపు నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో పేదలకు సన్న బియ్యం అందిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండ సురేఖ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేదికపై నుంచి *రాష్ట్ర అటవీ దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదని . కెసిఆర్ కుటుంబo మాత్రమే కోట్లు దండుకుని కోటీశ్వరులు అయ్యారని పేదలు మాత్రం ఎలా ఉన్నారో అలానే ఉన్నారని 17 నెలల క్రితం వచ్చిన ప్రజా సంక్షేమ ఇందిరమ్మ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందుతుందన్నారు అదేవిధంగా కేసముద్రం మండల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న వేం నరేందర్ రెడ్డి లాంటి నాయకుడు దొరకడం ఈ ప్రాంత అదృష్టమని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పట్టుదలకు ధన్యవాదాలు అని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.