ఎమ్మెల్యే మురళీ నాయక్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు

మంత్రిగా మీరు ఈ జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి.

ఎమ్మెల్యే మురళీ నాయక్ గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు అన్నాడు. బుధవారం నాడు మాజీ గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలను తిప్పికొట్టారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ పదేళ్ల పాటు తెలంగాణలో విధ్వంసపు పాలన చేసిన మీరు ఎమ్మెల్యే మురళీ నాయక్ పై అవాకులు చెవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈజిల్లాకు మీరు చేసిందేమిటో చెప్పాలన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఘనత నీకే దక్కిందని ఎద్దేవాచేశారు. మురళీ నాయక్ అంటే ఓ నిశ్శబ్ద విప్లవమన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మానుకోటకు 400కోట్ల నిధులు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యేకు దక్కిందన్నాడు. కేటీఆర్, కేసీఆర్ మానుకోట పర్యటనలో మానుకోటకిచ్చిన 50, కోట్లు, వార్డుల మౌలిక సదుపాయాల కోసం 1కోటి 98లక్షల రూపాయల జీవోలు అన్నీ ఉత్తిట్టి జీవోలు అని ఆగ్రహం వెళ్లగక్కారు. ఆ జీవో కాపీలను చూపిస్తూ అవి నిజమైన జీవోలు అయితే అధికారంలో ఉండి గడ్డి పీకారా అని ప్రశ్నించారు. మీరుచేసిన పాపాలు శాపాలై మీకు ఓటమిని తెచ్చాయని అన్నాడు. ఆకడుపు మంటతో అహంకారంతో స్థాయిని మరచి విమర్శలు చేయడం తగదన్నాడు. కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా, కట్టు బానిసలా ఊడిగం చేసిన మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత లేదన్నాడు. ఆరు గ్యారంటీలతో ప్రజా సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుమ్నామన్నాడు. ఇకనైనా మీరుకాని, మీ కేటీఆర్ కానీ, మానుకోట బిఅరెస్ నాయకత్వం కానీ ఇంకోసారి కారు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
స్థాయిని మరిచి మీ కేటీఆర్ చేస్తున్న సవాలుకు మేము సరిపోతామని దమ్ముంటే మానుకోటకు ఇచ్చిన ఉత్తుత్తి జీవోలపై చర్చకు రావాలని ఓ కుర్చీని కూడా ఖాళీగా ఉంచామని అన్నాడు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీపార్టీ తరపున నిలబడటానికి కూడా అభ్యర్థులు దొరకరన్నాడు. ఊరుకు ఒకరిద్దరు బాగుపడితే అది బిఅరెస్ పాలన, ఊరంతా బాగుపడితే అది కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యమన్నాడు.

ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సత్యమనోరమ, కమ్మగాని కృష్ణమూర్తి, నారాయణ్ సింగ్, సిరిపురం వీరన్న, గుగులోత్ రాములు నాయక్, భానోత్ హరిసింగ్ నాయక్, లకావత్ పద్మ, గండ్రాతి మల్లేష్, భూక్య లక్ష్మి, మాధవి, రాము తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *