మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
రాబోయే రోజులు విఆర్ఎస్ పార్టీ వేరని ఓపిక పడుతున్నవని మమ్మల్ని రెచ్చగొట్టొద్దని మరో మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది కబడ్డార్.. అని కాంగ్రెస్ నాయకులకు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ హెచ్చరించారు.మహబూబాబాద్ లో శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయాల్లో శుక్రవారం బిఆర్ఎస్ యువగర్జన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే బుద్ధి లేదని, హామీలను నెరవేర్చే శక్తి లేదని విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు మంత్రులు మానుకోటకు వచ్చి గతంలో ఎమ్మెల్యేగా తాను తీసుకువచ్చిన నిధులకు సంబంధించిన పనులని మళ్లీ రీ డిజైనింగ్ చేశారని ఇదేనా కాంగ్రెస్ తెలివని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్ కు తెలియదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సబ్బండ జాతుల గురించి ఆలోచించాలని రైతుల గురించి ఆలోచించాలని, మహిళల గురించి ఆలోచించాలని, అంతేతప్ప బీహార్ ఎస్ ఇచ్చిన నిధులను రీడిజైనింగ్ చేయడం కాదని శంకర్ నాయక్ ఏద్దేవా చేశారు. మానుకోటలో మహబూబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ మార్కు ఉండాలని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మానుకోట సుందరీ కారణలో భాగంగా రెండు సంవత్సరాల క్రితం మానుకోట సెంటర్లలో ఏర్పాటుచేసిన ఫౌంటైన్లను తొలగించి వాటి స్థానంలో తిరిగి నిర్మాణాలు చేపట్టడం ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. చెరువులు తెగిపోయి రెండు సంవత్సరాలైనా 18 నెలల్లో తట్టెడు మట్టి కూడా పోయలేని కాంగ్రెస్ అభివృద్ధి ఏం చేస్తుందని ఆయన అన్నారు పొద్దున లేస్తే కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని తిట్టడం విమర్శించడం తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులను సూచించారు. సమయానికి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే దమ్ము కూడా కాంగ్రెస్ కు లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ సత్తా చూపాలని మీ గ్రామాన్ని కాపాడుకోవాలని మీ మండలాన్ని కాపాడుకోవాలని, టిఆర్ఎస్ పౌరుషాన్ని చూపించాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీల అమలు ఏది?
యూత్ జిల్లా అధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడంలో అట్టర్ ప్లాప్ అయిందని ప్రభుత్వానికి ప్రజలను పాలించే చిత్తశుద్ధి లేదని టిఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ బిఆర్ఎస్ యువగర్జనలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజధాని అన్ని రంగాల్లో బాగుంటేనే రాష్ట్రం మొత్తం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటే జిల్లాలు, జిల్లాలు బాగుంటే గ్రామాలు బాగుంటాయని మురళీధర్ రెడ్డి అన్నారు. తాను ఎన్నో దేశాలు చూశానని వాటిని తలపించేలా నేడు హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధి లేదు కానీ హైడ్రా పేరుతో కూల్చడాలు ఉన్నాయని, బిఆర్ఎస్ హయాం లో ఎన్నో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని ముందుకు వచ్చాయని ఇప్పుడు ఆయింత కూడా లేకుండా పోయిందన్నారు. అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసలు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, హంగులు తప్ప మరేవి లేవన్నారు. టిఆర్ఎస్ యువకులు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో పార్టీ పోస్టులు చూడాలని ఎక్కడికక్కడ బిఆర్ఎస్ అభివృద్ధి- కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చలు పెట్టాలని అత్యధిక సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిల స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకునేలా కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు నాయని రంజిత్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు దామోదర్, గంధసిరి ఉప్పలయ్య, ఆవుల వెంకన్న, కిషన్, సుధగాని మురళి, తదితరులు పాల్గొన్నారు.