మహబూబాబాద్ సిపిఐ జిల్లా 3 మహాసభలు ఈనెల 5 6 తేదీల్లో కొరివి మండల కేంద్రంలో జరిగిన జిల్లా మహాసభలో మరిపెడ మండలం నీలి కుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణను జిల్లా సమితి సభ్యునిగా ఎన్నిక చేయడం జరిగింది మరిపెడ మండల కార్యదర్శి గా కొనసాగుతున్న బాలకృష్ణను పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను గుర్తించి జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నిక చేయడం జరిగిందని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి విజయ సారథి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నాకు అప్పగించిన ఈ బాధ్యతని భవిష్యత్తులో పార్టీ విస్తరణ కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంగా అందరిని కలుపుకొని ముందుకెళ్తానని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
సిపిఐ జిల్లా సమితి సభ్యుడి గా మారగాని బాలకృష్ణ ఎన్నిక
13
Jul