కేవలం ప్రైవేటు కళాశాలలోనే పూర్వ విద్యార్థుల సమ్మెలను జరుపుకుంటున్న ఈ రోజుల్లో ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా తమ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు వారి మధుర స్మృతులను పంచుకున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1989- 1992 బ్యాచ్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులు నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సభ నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరిని ఒకరు చూసుకుకి, ఆత్మీయ పలకరింపులతో చిన్ననాటి వారి ముఖాల్లో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి సంబరపడ్డారు. నాడు వారికి విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి పాదాభివందనం చేశారు. వారి వారి వయసును మరిచిపోయి కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ముగించారు. ఇలాంటి కలయికల వల్ల అందరిలో ఉల్లాసం, ఉత్సాహం పెంపొందుతుందని పూర్వ విద్యార్థులు చెప్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సౌండ్ బాక్స్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మల్లం నవీన్, రేణిగుంట విశ్వేశ్వరరావు, కేదిరెడ్డి యాకూబ్ రెడ్డి, తోట శ్రీనివాస్, ఆకులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, విజయ, వెంకట్ రెడ్డి, సురేందర్, యాద్దనపూడి శ్రీలత మాధవి, అనురాధ ఉపేంద్ర శోభారాణి పుష్పలీల పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక
14
Jul