కేసముద్రం మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం..
రానున్న స్థానిక ఎన్నికల్లో మన పార్టీ విజయం దిశగా అందరు పని చేయాలి. గ్రామ గ్రామానా గులాబీ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక మొత్తం ఫెయిల్ అయింది. మనం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకి తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరు తీసుకోవాలి. కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంది. రైతులకు సాగునీరు అందించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది మన కేసీఆర్. రైతులకు సాగునీరు అందియ్యక వారి కళ్ళల్లో కన్నీటిని నిలిపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నాట్లకి నాట్లకి మధ్యన రైతు బంధు వేసింది మన కేసిఆర్ గారు అయితే ఓట్లకి ఓట్లకి మధ్యన రైతు భరోసా వేసింది ఈ కపట కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో 2 సార్లు రైభరోసా ఎగగొట్టారు. ఈ విషయం ప్రజలకి అర్ధం అయ్యేలా చేయాలని ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు,ఉద్యమకారులు , కార్యకర్తలు, యూత్ & సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గోని ఈ సమావేశాన్ని విజయవంతం చేసారు.