యూరియా ఫర్టిలైజర్స్ పై సమీక్షా సమావేశం

వ్యవసాయ,సహకార శాఖ సొసైటీల సీఈవోలు, మండల వ్యవసాయ అధికారులతో యూరియా ఫర్టిలైజర్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన :: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో

మంగళవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ సీఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు జిల్లాలోని యూరియా ,ఫర్టిలైజర్స్ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో సమీక్షా సమావేశం నిర్వహించారు,

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రుణమాఫీ, తదితర పథకాల ద్వారా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని (18) మండలాలకు సరిపడా ఎరువులు, 7346, మెట్రిక్ టన్నుల యూరియా, సీడ్స్, ఫర్టిలైజర్ , కావలసిన అన్ని సిద్ధంగా ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కల్తీ ఎరువులు అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహించాలని సూచించారు.
సొసైటీల ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క రైతుకు ఎరువుల పంపిణీ చేయాలని సూచించారు, రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు,
డిమాండ్ కు అనుగుణంగా యూరియా ఇతర ఫర్టిలైజర్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్స్ మురళి, విజయ్ చందర్, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *