మహిళలకు ఈ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు బతుకమ్మ పండుగే

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్

మహబూబాబాద్ పట్టణంలోని యశోద గార్డెన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, బ్యాంకు లింకేజ్, రుణాలు లోన్ బీమా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు. మహిళలను కొటీశ్వరుల్ని చేయడమే లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల, బస్సులు, పెట్రోల్ పంపుల నిర్వహణ బాధ్యత, అప్పగించి వారికి తోడ్పాటునందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో 4 మండల సమాఖ్యలు, 204 గ్రామా సంఘాలు, 5243 స్వయం సహాయక బృందాలకు 55,278 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకు లింకేజి ద్వారా (3033) గ్రూపులకు 241.58 కోట్ల రూపాయల ఋణాలు మంజూరి (10652) గ్రూపులకు 11.58 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు మంజూరి చేయడమైనదని, 2410 ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయడమైనదని, 4 ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ లు ఏర్పాటు చేయడమైనదని 1 మిల్క్ పార్లరు, మొబైల్ ఫిష్ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడమైనదని, 1 ఆర్.టి.సి బస్సు మహబూబాబాద్ మండలానికి మంజూరి అయినదని నెలకు రూ. 69,468/- అద్దె సంబంధిత మండల సమాఖ్యకు చెల్లించుట జరుగుతున్నదని, (35,206) స్కూల్ యూనిఫాంలు (241) మంది మహిళా టైలర్లతో కుట్టించడం జరిగిందని, లోన్ బీమా క్రింద (31) క్లెయిమ్ లకు గాను 27.43 లక్షల రూపాయలు మంజూరి చేయడమైనదని, సంఘ సభ్యురాలు ఏదైనా కారణంచే చనిపోయిన ఆమె అప్పు గరిష్టంగా 2.00 లక్షల వరకు మాఫీ చేయబడునని ప్రమాద భీమా క్రింద (4) క్లెయిమ్ కు గాను రూ.40.00 లక్షలు మంజూరి చేయడమైనదని (సంఘ సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోయిన / శాశ్వత అంగవైలక్యం (100%) జరిగితే, రూ.10.00 లక్షల వరకు మంజూరిచేయబడునుని అమ్మ ఆదర్శ పాటశాల కమిటి చైర్మన్ గా మహిళా సంఘ సభ్యులను నియమించి (34) స్కూల్లలో 2.98 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణ మరియు నిర్వహణ పనులను అప్పగించడం జరిగిందన్నారు. 14 మార్కెటింగ్ సెంటర్ల ద్వారా రభీ- 2025 సీజన్లో 1.54 లక్షల క్వింటాళ్ళ వడ్లు కొనుగోలు చేయడం ద్వారా 50.84 లక్షల రూపాయలు కమిషన్ పొందడం జరిగినదని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి, డి.ఆర్.డి.ఓ మధుసూదన రాజు, స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్, ఎం.పి.డి.ఓ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *