జిల్లా (ఇన్చార్జి) వ్యవసాయ శాఖ అధికారి అజ్మీరా శ్రీనివాసరావు
శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ మండల విస్తరణ అధికారులు సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు అమలుపై శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే కార్యక్రమాలు పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ రైతు భరోసా, రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రీ విత్తనాల మినీ కిడ్స్ పంపిణీ, విత్తన ఉత్పత్తి కింద ఇవ్వబడిన మేలైన కిడ్స్ తదితర కార్యక్రమాల పట్ల రైతులకు సేవలు అందించాలనీ సూచించారు,
మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు ,పురుగుల మందుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి యూరియా, డిఏపి, పొటాష్, సింగల్ సూపర్ ఫాస్ట్, తదితర ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు,
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రాలలో ప్రైవేటు డీలర్స్ దగ్గర ఉన్న యూరియా, డిఏపి, పొటాష్, సింగల్ సూపర్ ఫాస్ట్, ల స్టాక్ లను తనిఖీ చేస్తూ ఉండాలని, ఎవరైనా అధిక ధరలు ,కల్తీ విత్తనాలు ఎరువులు, అమ్మిన యెడల ప్రభుత్వం సూచించిన ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు,
టెక్నికల్ ఏవో విజ్ఞాన్, మోహన్ రాజు, జావిద్ ఖాన్, టెక్నికల్ ఏ డి ఏ మురళి, ఏడిఏ విజయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.