క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్వేయర్ లైసెన్స్ జారీ

భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పాలిటెక్నిక్, ఐటీఐ సివిల్, బీటెక్ అభ్యసించిన వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి జిల్లాల వారీగా అర్హులను గుర్తించి 50 రోజుల పాటు శిక్షణ అందిస్తోంది. ప్రస్తుత మండల సర్వేయర్లు అభ్యర్ధులకు బోధిస్తున్నారు. శిక్షణలో భాగంగా రెండు పరీక్షలు, ఒకటి ఫీల్డ్ పరీక్షలు నిర్వహిసంచారు. శిక్షణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. తరగతి గదుల్లో థియరీ, క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు మూడు రోజులు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

పరీక్షలు.. మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈనెల 26 నాటికి 50 రోజుల శిక్షణ ముగుస్తుంది

శిక్షణలో అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షను పర్యవేక్షిస్తున్న ఏడీ నరసింహ మూర్తి 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు థియరీలో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లాటింగ్, కాలిక్యులేషన్ కి పరీక్ష నిర్వహిస్తారు. 28, 20 తేదీల్లో క్షేత్రస్థాయికి అభ్యర్థులను తీసుకెళ్లి కొంత భూ విస్తీర్ణం అప్పగించి కొలత వేసి ప్లాటింగ్ చేయటం, అనంతరం కాగితాలపై ప్లాటింగ్, కాలిక్యులేషన్ చేసే పరీక్ష నిర్వహించనున్నట్లు మానుకోట జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ నరసింహ మూర్తి తెలిపారు. అభ్యర్ధులను పరీక్షలకు అనుమతించటం, తదనంతరం ఎంపిక, వారిని మండలాల వారీగా ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉందన్నారు. మానుకోట జిల్లాలో 203 మంది దరఖాస్తులు సమర్పించగా 180 మంది తమ పేర్లను శిక్షణ కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 150 మంది రోజువారీ శిక్షణకు హాజరవుతున్నారు. మానుకోట జిల్లాలోని అభ్యర్ధులకు మానుకోట జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు ఈనెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనల ప్రకారం ప్రతి మండలానికి ఐదు నుంచి ఆరుగురు కొత్త ప్రైవేట్ సర్వేలను తీసుకోని ప్రతి మండలానికి నియమించనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *