మంజూరు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్ లేక
మానుకోట జిల్లాలో సుమారు 5000 మంది కార్మికులకు ఉపాధి కల్పించే వందే భారత్ రైల్వే కోచ్ POH .ROH మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ (మెగా ఫ్రైట్ మెయిన్టెనెన్స్ ) ఆవశ్యకతను రైల్వే మజ్దూర్ తెలపగా వెంటనే స్పందించి నాయకులు మానుకోట బిజెపి జిల్లా అధ్యక్షులు వల్లభూ వెంకటేశ్వర్లు గారు మరియు బిజెపి నాయకులు వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగారికి మరియు జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది . దానికి స్పందిస్తూ ఈరోజు కాజీపేటకు విచ్చేసినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవి గారు వందే భరత్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తూ లేక విడుదల చేయడం జరిగింది. ఫ్యాక్టరీ నిర్మాణానికి గాను 908 కోట్లు విడుదల చేయడం జరిగింది సుమారు 300 ఎకరాలు అవసరమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేయాలని తెలుపడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ నిర్ణయాన్ని హర్షిస్తూ మానుకోట జిల్లా బిజెపి అధ్యక్షులు మరియు నాయకులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి గారికి మరియు. మంజూరుకు కృషి చేసిన హుస్సేన్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం మానుకోట జిల్లా బిజెపి నాయకులు కేంద్రమంత్రి గారిని జిల్లా కేంద్రమైన మానుకోట రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది