ముఖ్యఅతిథిగా హాజరయిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
పాల్వంచ ( )కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు వేడుకలను పాల్వంచ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, నూకల రంగారావు, స్థానిక నాయకులతో కలిసి కేకును కట్ చేసి ఖర్గే కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే పార్టీకి చిరస్మరణీయమైన సేవలు అందిస్తున్నారని, ఆయన సేవలు పార్టీకి మరి ఎంతో అవసరమన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులను అలంకరించిన ఖర్గే నేత్రుత్వంలో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందు తోందన్నారు. ఈ కార్యక్రమములో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు,అనుబంధ సంఘ నాయకులు,మహిళా సంఘ నాయకులు,NSUI,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.