పి ఆర్ టి యు మహబూబాబాద్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

పిఆర్టియు మహబూబాబాదు జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం స్థానిక లయన్స్ భవనములు ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సమావేశం జిల్లా మాజీ అధ్యక్షులు బద్రి నారాయణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ గారు హాజరైనారు ఈ సమావేశంలో జిల్లా శాఖ నూతన అధ్యక్షునిగా మిర్యాల సతీష్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా సాగర్లమూడి శ్రీధర్ గార్లను 18 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . వీరిచే ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు గారు ప్రస్తుత అధ్యక్షులు కట్టా శేఖర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నికల సహకరించిన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు ప్రాథమిక సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లు సమస్యలు తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పదోన్నతులు ఇచ్చే విధంగా హెల్త్ కార్డు సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు గీత వెంకటరెడ్డి సీతారాములు కృష్ణారెడ్డి వినోద్ హాలియా నాయక్ రామ్మూర్తి జిల్లా బాధ్యతలు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *