హెచ్ఐవి ఎయిడ్స్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ సమీక్ష

సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ అద్యక్షతన క్వార్టర్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, హెచ్ఐవి నిర్ధారణ, చికిత్స, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పట్ల ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో హెచ్ఐవి పాజిటివ్ కేసుల వివరాలు, వారు పొందే సేవలు, ART సెంటర్ల పనితీరు, టార్గెట్ గ్రూపులకు (F-SW, MSM, TG, Migrants) అందజేసే సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నిర్ధిష్ట గమ్యాల ప్రకారం పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ కే జ్యోతి, క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ సారయ్య, సిపిఓ మహేష్,ఐ సి టి సి స్టాఫ్ రమేష్, ఎన్జీవోస్, లింక్ వర్కర్స్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *