ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.రాజేంద్రప్రసాద్

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకువెళ్లాలని డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ డిపిఆర్ఓ కార్యాలయంలో సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సత్యనారాయణ, టీం లీడర్లు కొమీరే వెంకన్న, గిద్దె రాంనర్సయ్య, మెరుగు రవీందర్ గౌడ్, లతో కలిసి డిపిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నందున వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకువెళ్లే గురుత్వరబాధ్యత ప్రభుత్వ సాంస్కృతిక సారథి సభ్యులపై ఉందని ఆయన అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి,500 కే గ్యాస్ పంపిణీ, సన్న బియ్యం,రేషన్ కార్డుల, పంపిణీ, ఇందిరా జల గిరి వికాసం, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, మహిళలకు పెట్రోల్ పంపులు నిర్వహణ, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ, తదితర 6 గ్యారంటీల పథకాలు ద్వారా ప్రజలు ఎంతో ఉపయోగపడటం జరుగుతుందని రాజేంద్రప్రసాద్ అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. వినూత్న రీతుల్లో పాటలు, పల్లె సుద్దులు, వీధి నాటకాలు తదితర రూపాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, ఆయన అన్నారు. జిల్లాలో జరిగే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమాలలో సాంస్కృతిక సారధులు భాగస్వాములు కావాలని డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సమావేశంలో కె.రాము, సాంస్కృతిక సారథి సభ్యులు బండ వెంకన్న,ఐలేష్ కుమార్, భరత్, దర్శనం యుగంధర్, సురేష్, డప్పు శ్రీను, నరేష్, ప్రవీణ్, గౌరారపు యుగేందర్, బక్కీ యాది, కందుకూరి అనిల్, పరమేష్, పాష, కవిత,రోజా, రాజ్యలక్ష్మి, అశ్విని, సింధుజ, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *