రాబోయే రోజులల్లో చెట్లను రారికి వేస్తే ఆక్సీజన్ లేక మానవులు ఏవిధంగా వీపుకు ఆక్సీజన్ సైలెడర్ పెట్టుకొని రిరుగుతమో కండ్లకు కట్టినట్టు ప్రదర్శన ద్వారా వీపుకు సోలేడర్ కట్టుకొని. ఒక చేతితో మొక్క పట్టుకొని చూపించిన హరిత మిత్ర అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు దైద వెంకన్న. ఈ ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరూ అన్నతమ్ములకు రాఖీలు కట్టి రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు.కానీ ప్రజా హృదయం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మదరబోయిన యకన్న బృందం సహకారంతో పాత కలెక్టర్ ఆఫీసు రోడ్డులో ఉన్న వివిధ రకాల చెట్లకు మహిళలలు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఆక్సీజన్ ఇచ్చే చెట్లకు 7 సంవత్సరాలుగా రాఖీలు కట్టిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు దైద వెంకన్న.మదారబోయిన యకన్నలు మాట్లాడుతూ……. చెట్లు లేకుంటే మానవ మనుగడ సాగదని అందుకే వృక్షాలను పరిరక్షించాలని. పచ్చని వాతావరణం నెలకొల్పాలని లక్ష్యంతో గత 7 సంవత్సరాలుగా అడపడుచులతో చెట్లకు పసుపు కుంకుమలు పెట్టీ రాఖీలు కట్టి మనుషులకు చెట్లకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు మాటలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం మన దేశం లో ఉన్నదని.అది మానవుల దగ్గర నుంచి మొదలుకొని చాలా మంది ప్రకృతిని ఆరాధించే వారని మానవుడు జీవించడానికి అవసరమైన అన్ని ప్రకృతి అందిస్తుందని అన్నారు.కాబట్టి మానవుడు ప్రకృతి వనరులను కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు.ఆడపడుచులు కూడా మట్లాడి వారి అన్నందన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటి రామక్క.మదరబోయిన లింగన్న. గంట కొమలత. వల్లపు స్వప్న. కడారి మంజుల. గుంటి కార్తీక్.బెజ్జం ఐలేష్. వల్లపు హరిబాబు. జంగా కుమార్.బందరి రాములు. కొత్త ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా హృదయం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృక్షా బందన్
09
Aug