నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు చట్టం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్రంలో పాలన చేస్తున్న బిజెపి పార్టీనే అని ఆత్మ కమిటీ చైర్మన్ , సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు
సిపిఐ కొరవి మండల కార్యవర్గ సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాస్త్రీయ సర్వే నిర్వహించి అధిక జనాభా కలిగిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ, కుంటి సాకులు చెబుతూ ,బిల్లుకు మోకాలడ్డుతూ బీసీ లకు న్యాయంగా చేoదాల్సిన 42 శాతం వాటాను అడ్డుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు
పార్టీ రాష్ట్ర మహాసభల గోడ పత్రాలను ఆవిష్కరించి ఈ నెల 20 నుండి 22 వరకు మేడ్చల్ జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బుడమ వెంకన్న, కన్నే వెంకన్న. కలగూర నాగరాజు తదితరులు పాల్గొన్నారు
బీసీ రిజర్వేషన్ల కి ప్రధాన అడ్డంకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం
09
Aug