ఫర్టిలైజర్ షాప్, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, డోర్నకల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు,

డోర్నకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాల, ఫర్టిలైజర్ షాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ క్లాసుల ద్వారా తరగతుల నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టు వారీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యా బోధనలు అందించాలన్నారు,
ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని, పాఠశాల పరిసరాలు డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ మరుగుదొడ్లు తదితర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా షెడ్యూలు ప్రకారం నిత్యం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.
భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలన్నారు.
పిల్లల విద్యాసామర్ధ్యాలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టించద్దని, అధిక ధరలకు అమ్మ వద్దని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అమ్మకాలు జరపాలని, రైతులకు అందుబాటు సమయాలలో సంబంధిత ఫర్టిలైజర్ షాపులను ప్రారంభించాలని,
ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే రైతు యొక్క వివరాలు పాసుబుక్ ఆధార్ కార్డు ద్వారా అమ్మకాలు జరపాలని,
దుకాణంలోని ఆన్లైన్ ఓపి ఎమ్మెస్, ఫిజికల్ గోడౌన్ నిలువలు కచ్చితంగా ఉండాలన్నారు,
స్వయంగా రిజిస్టర్ లను పరిశీలించి ఖచ్చితమైన సమాచారం రైతులకు చేరవేయాలని ఆరోజు స్టాక్ వివరాలు రావలసిన స్టాక్ వివరాలు అన్ని రైతులకు విషయ సూచిక ద్వారా తెలియజేయాలన్నా,
నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రస్తుతం రైతులు వేసుకున్న పంటలకు అనుగుణంగా ఫర్టిలైజర్స్ మందుల వినియోగం పూర్తిగా తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వానాకాలం సీజన్ లో విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగినన్ని మందులు సిద్ధంగా ఉంచు కోవాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు నిర్వహించాలని, నిత్యం ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మందుల స్టాక్ వివరాలు సిబ్బంది హాజరు వివరాలు ఆయన పరిశీలించారు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, సీజన్కు అనుగుణంగా వైద్య కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని ప్రత్యేక అధికారులందరూ వారికి కేటాయించిన మండలాలలో వర్షాకాలం వరదల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకొని సిద్ధంగా ఉండాలని, ప్రతి ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ నిర్వహించి, యూరియా నిలువలను సరిచూసుకోవాలన్నారు.
వసతి గృహాలు, పాఠశాలలు క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు, ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, డోర్నకల్ తహసిల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *