మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నీ జిల్లా ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా గోదాంల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని స్పష్టం చేశారు. గోదాంలలో నిల్వ ఉంచిన ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యూరియా కోసం రైతులకు ఇబ్బంది పడకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియాను సకాలంలో అందించాలన్నారు.
యూరియా స్టాక్‌ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన అన్నారు, వీలైతే టోకెన్ స్మార్ట్ ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు. అన్ని మండలాలకు యూరియా నిలువలు వచ్చేలా ప్రభుత్వం, అధికారయంత్రాంగం కృషి చేస్తుందని, ప్రతి మండలానికి యూరియా లోడ్ లు వస్తాయని, రైతులు కొంత సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు గూడూరు పిఎస్ ఎస్ఐ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మార్వో నాగ భవాని, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డి సి ఓ ఎన్వి రావు, ఏవో ఎండి అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్దేశపూర్వకంగా యూరియా కృత్రిమ కొరత సృష్టించవద్దు:జిల్లా ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్
19
Aug