లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి.వీరన్న
కాలగర్భంలో కలిసిపోయిన ఏ చరిత్రకైనా వాటికి సంబంధించిన ఛాయాచిత్రాలే సాక్ష్యంగా నిలుస్తాయని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక లయన్స్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. కోట్ల అక్షరాలతో కూడిన కథనానికి కూడా ఒక్క ఫోటోతోనే పరిపూర్ణత చేకూరుతుందని చెప్పారు. లక్షలాది వ్యాఖ్యలకు ఒక ఫోటో ద్వారా ఆలోచనలను కలిగిస్తుంటుందన్నారు. చిన్నప్పటి తీపీ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేందుకు ఛాయాచిత్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఫోటోగ్రఫీ సాహసోపేతమైన వృత్తి అని పేర్కొన్నారు. ఫోటో గ్రాఫర్స్ ను గుర్తించి వారిని గౌరవించడం క్లబ్ గర్వంగా భావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రాఫర్ మురళీమోహన్, సీనియర్ ఫోటోగ్రాఫర్ చుక్కల పరమేశ్వర్ లను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్, మైక్రో క్యాబినెట్ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు, సీనియర్ క్లబ్ బాద్యులు రావుల రవిచందర్ రెడ్డి, బవిరిశెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ చాపల రంజిత్ రెడ్డి, పమ్మి సనాతనా చారి, అనుమాల సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు .