చెప్పులు కుట్టే వారికి లయన్స్ క్లబ్ గొడుగుల పంపిణీ

క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న

నిరుపేదలకు అండగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న తెలిపారు. క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ డాక్టర్ వెనిగెళ్ల జగన్ మోహన్ రావు, లావణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా బుధవారం మానుకోట పట్టణంలో చెప్పులు కుట్టుకుని ఎండా, వానల్లో ఇబ్బంది పడుతున్న వృత్తిదారులకు గొడుగులు పంపిణీ చేశారు . ఇందిరాగాంధీ, నెహ్రూ, శ్రీనివాస థియేటర్ సెంటర్లలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న వారికి ఈ గొడుగులను అందజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ వీరన్న మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారికి సేవలు అందేలా తమ క్లబ్ విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సీనియర్ వైద్యులుగా గుర్తింపు పొందిన డాక్టర్ జగన్ మోహన్ రావు గారు తమ పెళ్లి రోజు సందర్భంగా తనవంతు సాయం అందిస్తు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తమ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్, మైక్రో క్యాబినెట్ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు, క్లబ్ బాధ్యులు డాక్టర్ వెనిగెళ్ల జగన్ మోహన్ రావు, పమ్మి సనాతన చారి, సాదుల సురేష్ బాబు, మాలె కాశీనాథ్, శ్రీరంగం నవీన్, అనుమాల సిద్దార్థ, సీఐటీయు జిల్లా నాయకులు ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *