ఈనెల 24న మహబూబాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా అసోసియేషన్ సెక్రెటరీ భాస నాగమణి తెలిపారు. ఇందులో ఎంపికైన అథ్లెట్స్ క్రీడాకారులు 11వ తెలంగాణ స్టేట్ జూనియర్స్ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 24న ఆదివారం జరిగే సెలక్షన్స్ లో బాలబాలికలు వారి జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ తీసుకురావాల్సిందిగా ఆమె తెలిపారు. అండర్ -14, 16, 18, 20 విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
24న జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్
21
Aug