మట్టి గణపతి విగ్రహ దాత పోకల అనుష -సతీష్ దంపతులు
మహబూబాబాద్ /కేసముద్రం :- కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల అమీనాపురం గ్రామంలో బీసీ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. బుధవారం గణపతి ప్రతిష్ట విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ లో విగ్రహ దాత పోకల అనూష -సతీష్ మరియు కమిటీ వారు పాల్గొని పూజను ఘనంగా నిర్వహించారు. కమిటీ వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సంకల్పంతో మట్టి గణపతిని పూజిస్తున్నామని చెప్పి ఘనంగా రోజు విశేష పూజ కార్యక్రమాలు జరుపుకుంటున్నామని మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సంతోషంగా వర్ధిల్లాలని భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యను పూజిస్తున్నట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు పోకల సతీష్, ఉపాధ్యక్షులు కొనకటి మధు, నూకల ఈశ్వర్, గౌరవ అధ్యక్షులు ఆరూరి ఉదయ్, బానోతు సర్రం, కోశాధికారి ఆరూరి వినయ్, కార్యదర్శి బానోత్ రమేష్, అంబటి వెంకన్న,సెక్రెటరీ అంబటి రమేష్, గౌరవ సలహాదారులు యారా రమేష్, గుగ్గిళ్ళ బ్రహ్మం, ఉత్సవ కమిటీ సభ్యులు హరీష్, రేవంత్ కొనుకటి హరీష్ బన్నీ ఆరూరి ఉదయ్,వివేక్, తదితరులు పాల్గొన్నారు.
వార్త ఇవ్వండి
లింకు ఇవ్వండి