మహబూబాబాద్: గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ తప్పనిసరి అని అన్నారు. సుదీర్ఘకాలం రవీందర్ రెడ్డి విద్యాశాఖలో సేవలందించి రాష్ట్రస్థాయిలో మహబూబాబాద్ జిల్లాను పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానంలో నిలబెట్టినందుకు ఆయన చేసిన కృషి అమోఘమైందన్నారు. పట్టుదల, క్రమశిక్షణ కు మారుపేరుగా ఆయన పని చేశారని గుర్తుకు చేశారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, మాట్లాడుతూ విద్యాశాఖ బలోపేతానికి రవీందర్ రెడ్డి ప్రణాళికా ప్రకారం పని చేశారని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన తదితరులు రవీందర్ రెడ్డి చేసిన కృషి సేవలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు జెడ్పి సీఈవో పురుషోత్తం, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, ఏ డిఎస్ఎల్ఆర్ నరసింహమూర్తి, వేముల సురేష్ గ్రౌండ్ వాటర్, డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, మెప్మా పీడీ విజయ, విద్యాశాఖ సిబ్బంది అప్పారావు, చంద్రశేఖర్ ఆజాద్, శ్రీరాములు, విజయ కుమారి, సతీష్, లచ్చి రాము, బాలాజీ, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
28
Aug