నకిలీ పట్టాదారు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

మహా తెలంగాణ న్యూస్

ఒక్కో పట్టాదారు పుస్తకానికి రూ.10,000 వసూలు చేస్తూ అక్రమంగా నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. వివిధ బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తామని తిరుగుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఒక లాప్టాప్, 16 నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేస్తున్న కొరవి మండలం మచ్చ తండా కు చెందిన మూడు బాలాజీ, ఆమంగల్ మండలం కస్నా తండాకు చెందిన బానోతు హరికిషన్, జాఫర్గడ్ మండలం ఓలా పురం గ్రామానికి చెందిన బానోతు వర్ధన్ ముగ్గురిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. యూనియన్ బ్యాంకు కొరవి బ్రాంచ్ లో ఒకరికి డోర్నకల్ బ్రాంచ్ లో ఆరుగురికి మహబూబాబాద్ బ్రాంచ్ లో ఒకరికి కెనరా బ్యాంక్ మహబూబాద్ బ్రాంచ్ లో ముగ్గురికి ఇలా మొత్తం 16 లక్షల 90000 లోన్లు మంజూరు అయ్యేలా మీరు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు ద్వారా ప్రయత్నం చేసినట్లు డిఎస్పీ తెలిపారు. దొంగ పాసుపుస్తకాల కేసును సుమోటోగా నమోదు చేసి విచారణ జరుపుతూ నిందితులను ఆగిపోకు తీసుకున్నట్లు ఆయన తెలిపారు మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు ఈ ముఠాతో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ సర్వయ్య సి సి ఎస్ ఇన్స్పెక్టర్, కొరవి ఎస్ఐ సతీష్ సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *