మహబూబాబాద్
మానుకోట జిల్లా కేంద్రంలోని మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలు నాయక్, సుచిత్ర దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం శనివారం ఘనంగా నిర్వహించారు. వె సందర్బంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు కుమారస్వామి, జగన్మోహన్ రావు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ… అన్నదాన కార్యక్రమం లో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనంతరం మైత్రి మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం డాక్టర్ బాలు నాయక్ సుచిత్ర దంపతులు మాట్లాడుతూ…విగ్నేశ్వరుడు ఆశీస్సులు ఎప్పటికీ మానుకోట ప్రజలకు ఉండాలని అన్నారు. గణేష్ ఉత్సవ సందర్భంగా పేదవాడి కడుపు నింపే ప్రయత్నం చేయడానికి ఈ మహా అన్నదాన కార్యక్రమం చేపట్టమని అన్నారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఎప్పటికీ మాపై చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు నిరంతరం చేపట్టడంలో మైత్రి హాస్పిటల్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.