తల్లితండ్రుల ఆశయాలను నెరవేర్చాలి : మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్

ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు.మహబూబాబాద్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కోసం 70 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగింది.అన్ని వసతులతో కొత్త భవనం నిర్మించబోతున్నామని తెలిపారు. హాస్టల్లో విద్యార్థుల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు.గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకువచ్చి, పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగి తల్లిదండ్రుల ఆశాయలను నెరవేర్చాలన్నారు. బలరాం నాయక్ గారు కూడా వారు చదువుకున్న సమయంలో హాస్టల్లో చదువుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చిన వారు చదువుపైనే దృష్టి పెట్టారన్నారు. కావున విద్యార్థిని విద్యార్థులు ఎన్ని కష్టాలు వచ్చినా విద్య మీద దృష్టి పెట్టాలి అని తెలిపారు…

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ,జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బలరాం నాయక్, జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ బి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *