బోర్లు, బావులు కింద ఆయిల్ పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు,మునగ వంటి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు – ఎకరానికి లక్షన్నర ఆదాయం.
గురువారం జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న తొర్రూరు, నెల్లికుదురు మండలం లోని పలు గ్రామాలలో ఉద్యాన పంటలు పరిశీలించి రైతులకు పలు సూచనలు ను చేశారు. రైతులు ఎత్తు మడులు, మల్చింగ్, పందిరి సాగు, ట్రెల్లిస్ సాగు, సేంద్రియ పద్ధతులు పాటించాలని అన్నారు. బోర్లు బావులు కింద ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, పసుపు,మునగ, మల్బరీ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసి ఎకరానికి లక్షన్నర వరకు ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.