*మైనారిటీ గురుకులంలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం*
హిందీ భాష భారత దేశ జాతీయ సమైక్యతకు ప్రతీక అని మహబూబాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనీ మైనారిటీ గురుకుల పాఠశాల లో శనివారము రోజున అకాడమిక్ కోఆర్డినేటర్ నరేష్ అధ్యక్షతన హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి వేముల కల్పన మరియు ఆర్ట్ టీచర్ రామకృష్ణ ప్రోత్సాహంతో వివిధ తరగతుల విద్యార్థులు 30 చార్ట్ లను తయారు చేసి ప్రదర్శనను నిర్వహించినారు. అనంతరము జరిగినటువంటి సభలో హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి వేముల కల్పన మాట్లాడుతూ భారత జాతీయ ఉద్యమంలో అఖిలభారతాన్ని జాగృతం చేసి భారత జాతిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష దోహదపడడంతో 1949 సెప్టెంబర్ 14న హిందీని భారత రాజ్యాంగ సభ అధికార భాషగా గుర్తించడంతో, ఆ జ్ఞాపకంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీని హిందీ భాషా దినోత్సవం గా జరుపుకోవదాము ఆనవాయితీగా మారినదని తెలిపినారు . భారత రాజ్యాంగం దేవనాగరి లిపిలో హిందీని యూనియన్ అధికార భాషగా స్వీకరించినదని అన్నారు . ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను ఇచ్చినారు . విద్యార్ధులు హిందీ ఉపాధ్యాయులను పుష్పగుచ్చము ఇచ్చి శాలువతో సన్మానించినారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇమాముద్దీన్ మహ్మద్ , వికాస్ ,రామన్న, లక్ష్మణ్, సురేందర్, రవి, సాదత్ సిద్ధిఖ, మహేష్, వెంకన్న, మూర్తి,వార్డెన్ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.