వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ బృంద గీతాల పోటీలు 2025
జాతీయ బృంద గీతాల పోటీలను, స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హాల్ నందు నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి భారతి వికాస్ పరిషత్ మానుకోట శాఖ అధ్యక్షులు శ్రీ ఒబిలి శెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించినారు. ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ బండి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి ఈ పాటల పోటీలు భారత సంస్కృతి, సాంప్రదాయాలనీ ప్రతిబింబిస్తాయని పిల్లలలో జాతీయ భావాన్ని, దేశభక్తిని కలిగిస్తాయని వివరించారు**విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీ వి వి నాగేందర్ గారు మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ చేపట్టినటువంటి కార్యక్రమాలను వివరిస్తూ, జాతీయ బృంద గీతాల పోటీలను, గురువందన చాత్రాభివందన మరియు భారత్ కో జానో (క్విజ్ పోటీలను) గురించి వివరించారు**ముగింపు మరియు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి భారత్ వికాస్ పరిషత్ ప్రాంత అధ్యక్షుడు శ్రీ డి .నాగ శేఖర్ గుప్తా గారు మాట్లాడుతూ, భారత్ వికాస్ పరిషత్ పంచ సూత్రాల ( సంపర్క్, సహాయోగ్, సంస్కార్, సేవ, సమర్పన్) పై ఆధారపడి పనిచేస్తున్నదని, వాటి ప్రాధాన్యతను వివరించడం జరిగినది**ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న సీనియర్ న్యాయవాది మరియు మానుకోట శాఖ ఫౌండర్ అయినటువంటి శ్రీ ఎన్ వి చలపతి రావు గారు మాట్లాడుతూ, భారత్ వికాస్ పరిషత్ ఆవిర్భావం, మానుకోట శాఖ చేస్తున్న విశిష్ట కార్యక్రమాల గురించి తెలియపరిచారు**మరియొక విశిష్ట అతిథులుగా పాల్గొన్న టౌన్ సిఐ లు శ్రీ మహేందర్ రెడ్డి గారు మరియు శ్రీ డి.జీ. రాజు గారు మాట్లాడుతూ, భారత్ వికాస్ పరిషత్ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందించదగిన విషయము అని పిల్లలలో భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని జాతీయ భావాన్ని పెంపొందించుటలలో ఈ యొక్క భారతి వికాస్ పరిషత్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాము అని తెలియజేసినారు ఈ**ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తము 12 పాఠశాలల విద్యార్థి, విద్యార్థినీలు సుమారు 170 మంది పాల్గొనటం జరిగినది. వారి వెంట ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు మరియు కరస్పాండెన్సులు పాల్గొన్నారు**హిందీ మరియు సంస్కృత విభాగములలో**మొదటి బహుమతి: గీతాంజలి హై స్కూల్**రెండవ బహుమతి: మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల**మూడవ బహుమతి: కస్తూరిబా గాంధీ విద్యాలయం వారు గెలుచుకున్నారు**తెలుగు మరియు జానపద గీతాలలో**మొదటి బహుమతి: జ్యోతిరావు పూలే పాఠశాల**రెండవ బహుమతి: జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ మానుకోట**మూడవ బహుమతి: శ్రీ చైతన్య హై స్కూల్ వారు గెలుచుకున్నారు**ఈ కార్యక్రమానికి శ్రీ ముడంబై లక్ష్మీనారాయణ చార్యులు మరియు సాదుల ఉదయ్ శ్రీ గార్లు నాయనేతలుగా వ్యవహరించారు**ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ శాఖ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ లోయ, కోశాధికారి రేణిగుంట్ల గణేష్ కృష్ణ, ఉపాధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యక్రమ కన్వీనర్ భూపాల్ రెడ్డి గారు, మహిళ కన్వీనర్ సుజాత, గారు, కవిత గారు, సభ్యులు పూనంచంద్ మల్పాని, విశ్వనాథ్ గారు, లెనిన్ బాబు, లలిత, లక్ష్మణ్ జి, సుజాత, స్వాతి, గూడూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వందన సమర్పణ మరియు జాతీయ గీత లాపన ముగిసినది.