లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న
మహబూబాబాద్:
చిన్న తనం నుంచే చదువుపై ఆసక్తి ని పెంచుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న విద్యార్థులకు సూచించారు. శుక్రవారం లయన్స్ క్లబ్ గవర్నర్ (320-ఎఫ్) డాక్టర్ కె. చంద్రశేఖర్ ఆర్యా , ఆయన సతీమణి ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ 320F, డాక్టర్ రాజేశ్వరి ల పుట్టినరోజు వేడుకలు మానుకోట భవానీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల నడుమ ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం శోభారాణి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ వీరన్న మాట్లాడుతూ.. సమాజం లో ఏ రంగంలోనైనా రాణించాలంటే విద్య సరైన మార్గం అని పేర్కొన్నారు. అందుకోసం ప్రాథమిక దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి కష్టపడి చదువుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ లాంటి సామాజిక సంస్థ లు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, సీనియర్ లయన్స్ బాద్యులు డాక్టర్ వెనిగళ్ల జగన్మోహన్ రావు, బవిరిశెట్టి నాగేశ్వరరావు, సాదుల సురేష్ బాబు, మాలె కాళీనాథ్, పాఠశాల ఉపాధ్యాయులు మాలతి, చంద్రం, కవిత , అంగన్వాడీ టీచర్ గుగులోతు లలిత తదితరులు పాల్గొన్నారు.