రూ.40,50,500 లక్షల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్

ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో 105 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹40,50,500 విలువైన చెక్కులను పంపిణీ చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు…

ఈ సందర్భంగా ఎంపి బలరాం నాయక్ గారు మాట్లాడుతూ…

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భారంగా మారిన వేళ, ఈ సహాయం ఎంతో అవసరమవుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వైద్యాన్ని కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని పేర్కొన్నారు. వారు ప్రభుత్వం పట్ల,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బాధితుల సమస్యలపై వెంటనే స్పందించే విధంగా సీఎంఆర్ఎఫ్ పథకం ప్రజలకు ఆశాకిరణంగా మారిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తోందని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు కడుతనే, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ నిజమైన పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు.

ఆదివాసులు,లంబాడీలు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉంటున్నాం,గిట్టని వాళ్లు కేసులు వేయించారు,ఆదివాసులు, లంబాడీల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉంది అని తెలిపారు…

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్లా యాదవ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వంశీ నాయక్,Nsui జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్సారీ, నెల్లికుదురు మడల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ నూనవత్ రమేష్,ప్రసాద్ నాయక్,మాధవపెద్ది అమరేందర్ రెడ్డి,భాస్కర్ నాయక్,జగదీష్,మాలోత్ అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *