మహబూబాబాద్ జిల్లా::: ప్రజలకు ప్రయాణికులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తో ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా స్కీం నిర్వహిస్తుందని మహబూబాబాద్ డిపో మేనేజర్ శ్రీమతి వి కళ్యాణి ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఈనెల 27 నుండి అక్టోబర్ 6 వరకు సెమి డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి అన్ని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు తమ టికెట్ వెనుక వైపు తమ పేరు, ఫోన్ నెంబర్, చిరునామా వ్రాసి మహబూబాబాద్ బస్టాండ్ నందు ఏర్పాటు చేయబడిన లక్కీ డిప్ బాక్స్ నందు మీ టికెట్‌ను వేయగలరు .అక్టోబర్ 8వ తారీకు హన్మకొండ రీజినల్ కార్యాలయం నందు అధికారుల సమక్షంలో లక్కీ డ్రా తీయబడుతుంది. అందులో విజేతలు అయినా ముగ్గురికి నగదు బహుమతులను అందజేస్తారు.
మొదటి బహుమతి 25000, రెండవ బహుమతి 15000, మూడో బహుమతి 10000 నగదు రూపంలో అందజేయబడునని తెలియజేసినారు. ఈరోజు నుండి మహబూబాబాద్ డిపో నుండి హైదరాబాద్ కు దసరా స్పెషల్ 10 బస్సులను రోజు నడిచే సర్వీస్ బస్సులతో సహా నడుపుతున్నట్లు చెప్పినారు.ఇట్టి సదా అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరు అని డిపో మేనేజర్ కోరారు.
TGSRTC సంస్థ దసరా కానుక
27
Sep