వికాస్ విద్యాసంస్థలలో బతుకమ్మ సంబరాలు

మహబూబాబాద్ పట్టణంలో స్థానిక వికాస్ జూనియర్ కళాశాలలో ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను కళాశాలల చైర్పర్సన్ ఇందిరా, కరస్పాండెంట్ బిక్కి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల చైర్పర్సన్ ఇందిరా విద్యార్థినీలు వేపకాయల బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి బతుకమ్మలను తయారుచేసి ఆ బంగారు బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో అంబరాన్ని అంటేలా అలరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇందిరా ఇది తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగని ఈ పండుగ కాకతీయుల కాలం నుండి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని దానిని మన కళాశాలలో గత 15 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నామని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి తెలియజేశారు.
కళాశాల కరస్పాండెంట్ బిక్కి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పండుగ మన తెలంగాణ ప్రాంత ప్రత్యేకతకు నిదర్శనమని మన ఐక్యతను తెలియజేసే పండుగని మతాలకు అతీతంగా అందరూ పూలతో బతుకమ్మలు పెట్టుకొని ఆడుకునే ఒక అద్భుత కార్యక్రమం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి వీరన్న, రవీందర్ ,రాజేశ్వరి, సునీత, మధు, రమేష్, నాగరాజు, సారంగం, యాకన్న, బిక్షపతి, నరేష్ , విద్యార్థులు అస్మిత, దీక్ష ,అక్షయ, జ్యోత్స్న ,ప్రియాంక, మాధవి, శ్రీజ, స్నేహ పెద్ద మొత్తంలో విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *