పవిత్ర గ్యార్వీ పండుగ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో అహ్లే సున్నత్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో పండుగను ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా మొదటగా ముస్లిం మత పెద్దలు స్వర్గీయ షేక్ అలీ గారి ఇంటి నుంచి జేండను పట్టణ పుర వీధుల్లో ఊరేగిస్తూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న జేండ గద్దె వద్ద ఫాతేహ కార్యక్రమం నిర్వహించారు. అక్కడే పేద ప్రజలకు సూమరు 800 మందికి భోజనాలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌలన సయిద్ రిజ్వి అహ్మద్, ఇమ్రాన్, మహ్మద్ ఫరిద్, అసద్ అలీ ఖాన్, ఆసీఫ్,హరుణ్,ఖలిద్,ఖలిల్, ఇస్మాయిల్ నాయక్,రియాజ్, అన్వర్,అశ్రఫ్,గయాజ్, అస్లాం, తదితరులు పాల్గొన్నారు
ఘనంగా పవిత్ర గ్యార్వీ పండుగ
04
Oct