ఘనంగా ఎమ్మెల్యే మురళి నాయక్ జన్మదిన వేడుకలు
మహబూబాబాద్
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా”భూక్యా మురళీ నాయక్ గారి జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గడిపెల్లి చరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ నేతృత్వంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
స్థానిక క్యాంపు కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన ఈ శిబిరంలో యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
జన్మదినం అంటే కేవలం వేడుక కాదు, సమాజానికి ఉపయోగపడే రోజుగా మార్చుకోవాలి అనే ఎమ్మెల్యే మురళీ నాయక్ సిద్దాంతం మేరకు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన యువతకు ఫోన్ లో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చివరగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు దేవారం ప్రకాష్ రెడ్డి, రమేష్ చందర్ రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, మిట్ట కంటి రాంరెడ్డి, చిట్టే వెంకన్న,ఖలీల్ పాషా, రమేష్, బోడ రవి,బెల్లంకొండ శ్రీనివాస్, నర్సింగ శ్రీనివాస్, గునిగంటి కమలాకర్, గార్లపాటి సాయి తేజ, రాంపల్లి నవీన్, గొల్లపల్లి మహేందర్, మధు తదితరులు పాల్గొన్నారు